సమంతను బెదిరించిన నాగచైతన్య..! ఆ సీక్రెట్ అందరికీ చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో

by Disha Web Desk 6 |
సమంతను బెదిరించిన నాగచైతన్య..! ఆ సీక్రెట్ అందరికీ చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలం ఎవ్వరికీ తెలియకుండా రిలేషన్ నడిపించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం జరిగాక టాలీవుడ్ ఇండస్ట్రీ క్యూట్ కపుల్‌గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి దారి వారు చూసుకుంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా.. సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇచ్చేందుకు వెయిట్ చేస్తుంది.

ఇక చై విషయానికి వస్తే.. తండేల్ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని ప్లాన్‌లో ఉన్నాడు. వారు విడిపోయి చాలా రోజులే అవుతున్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో చై- సామ్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో.. తాజాగా, నాగచైతన్య, సమంతను బెదిరించాడని ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ కూడా చేశాడని తెలుస్తోంది. వీరిద్దరు ఎవ్వరికీ తెలియకుండా దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న గొడవలు రావడంతో సమంత మాట్లాడుకుండా చై మీద కోపంగా ఉండేదని తెలుస్తోంది.

దీంతో ఏం చేయాలో తెలియక నువ్వు నాతో మాట్లాడకపోతే అందరికీ మన ప్రేమ గురించి ఎక్కడెక్కడ తిరిగామో కూడా చెప్తానని ఫన్నీగా బెరించేవాడట. అయినా సామ్ మాట్లాడక పోయేసరికి బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడని టాక్. దీంతో సమంత ప్రేమ గురించి తెలిస్తే పెంట పెంట అవుతుందని భయపడిపోయి చైతో మాట్లాడి అతను చెప్పినట్టు చేసేదట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. చై మామూలోడు కాదు సమంతతో ఓ ఆట ఆడుకున్నాడుగా అని అంటున్నారు.

Next Story

Most Viewed