రామతీర్థం ఘటనలో సీఎం జగన్ కీలక నిర్ణయం

by  |
రామతీర్థం ఘటనలో సీఎం జగన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : రామతీర్థం ఘటనలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసును CID ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ కేసు విషయంలో మరో రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

అంతేకాకుండా నెలరోజుల్లోగా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని పున: ప్రతిష్టించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో హిందూ ఆలయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 24వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed