ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

by  |
ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు
X

దిశ, ఏపీ బ్యూరో: ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్‌నెట్‌ కోసం గతంలో గుత్తేదారులకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఫైబర్‌నెట్‌ ఎండీ, ఛైర్మన్‌ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని 11,274 గ్రామాలకు ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed