విద్యార్థులను అభినందించిన సీఐ మహేశ్ గౌడ్

by  |
Shankerpalli-CI
X

దిశ, శంకర్ పల్లి: కరాటే నేర్చుకోవడంతో ఆత్మరక్షణతోపాటు విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు ఎంతో ఉపయోగపడుతాయని శంకర్ పల్లి సీఐ మహేష్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈనెల 19 20, 21 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట గ్రామానికి చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచారు. ఎస్ మానస్ గౌడ్ సిల్వర్ మెడల్, కె సాయి చరణ్ బ్రాంజ్ మెడల్, జె మానస బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారిని శంకర్ పల్లి సీఐ మహేష్ గౌడ్, ఎస్సై లక్ష్మీనారాయణలు అభినందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడంతో చిన్నారుల్లో శారీరక దృఢత్వం, శత్రువును ఎదుర్కొనే విధానం, ఆరోగ్య పరిరక్షణ తదితర వాటిని పొందవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదువుతోపాటు కరాటే శిక్షణ కూడా ఇస్తే వారిలో ఆత్మస్థైర్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుతోపాటు క్రీడల్లో కూడా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Next Story