కరోనా కష్టంలో అమ్మకాల జోరు పెంచిన బ్రాండ్!

by  |
కరోనా కష్టంలో అమ్మకాల జోరు పెంచిన బ్రాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ ఉంది. దీనివల్ల అనేక కంపెనీలు బిజినెస్ లేక అల్లాడిపోతున్నాయి. అయితే, ఈ కష్టకాలంలోనూ లాభాలను చూస్తున్నాయి కొన్ని సంస్థలు. దేశీయ ఆయుర్వేద బ్రాండ్ అయిన పతంజలి చవంప్రాశ్ అమ్మకాలు భారీగా పెరిగినట్లు మార్కెట్లో జోరుగా వినిపిస్తున్న వార్త. కేవలం నెలరోజుల్లో ఈ బ్రాండ్ అమ్మకాలు 400 శాతం పెరిగిందంటే వీటి అమ్మకాలు ఎలాయో ఊహించవచ్చు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య చవన్‌ప్రాశ్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు.

కరోనా వైరస్ ప్రధానంగా ఇమ్యూనిటీ సంబధిత వ్యాధి కావడంతో ప్రజలెక్కువగా ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేదిత ప్రోడక్ట్‌ల కోసం ఎగబడుతున్నారు. చవన్‌ప్రాశ్‌లో ముఖ్యంగా సీ విటమి ఉంటుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రజలకు ఏళ్లుగా ఉన్న నమ్మకం. దీంతో గత నెలరోజులుగా చవన్‌ప్రాశ్‌ను కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. చవన్‌ప్రాశ్‌ను అమ్మే కంపెనీల్లో డాబర్‌దే కీలక భాగస్వామ్యం ఉంది. మార్కెట్లో డాబర్ వారి చవన్‌ప్రాశ్‌ను ప్రజలు ఎక్కువగా కొనుక్కుంటారు. ఈ బ్రాండ్ విలువను ప్రజలెక్కువగా గౌరవిస్తారు. ఈ కారణాలతో డాబర్ కంపెనీకి చెందిన చవన్‌ప్రాశ్‌ను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా మార్కెట్లో ఈ బ్రాండ్ వాటా 60 శాతం వరకూ ఉంటుంది. దీని తర్వాత ఇమామీ, పతంజలి, బైధ్యనాథ్ వంటి ఇతర ఆయుర్వేద బ్రాండ్‌లకు డిమాండ్ బాగా ఉంది. ఇప్పుడు దేశంలో లాక్‌డౌన్ ఉన్న కారణంగా సరఫరా నెమ్మదించిందని, అడ్డంకులు తొలిగితే తిరిగి అమ్మకాలు పెరుగుతాయని సంస్థకు చెందిన వారు చెబుతున్నారు.

Tags: Immunity, Ayurveda, Government of India, Chyawanprash Dabur Chyawanprash

Next Story

Most Viewed