చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని క్రిస్ లిన్ విజ్ఞప్తి

by  |
చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని క్రిస్ లిన్ విజ్ఞప్తి
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్ లిన్.. తాను స్వదేశానికి చేరుకోవడానికి చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చే విమానాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లను సురక్షితంగా ఇళ్లకు చేర్చే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోవాలని అన్నాడు. ఇందుకు గానూ అందరి కోసం ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని అతడు కోరాడు.

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెట్లు ఆడుతున్నందుకు బీసీసీఐ ఇస్తున్న డబ్బునుంచి 10 శాతాన్ని చార్టెడ్ ఫ్లైట్ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని క్రిస్ లిన్ పేర్కొనడం గమనార్హం. ‘ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్న విషయం తెలుసు. కానీ ఇక్కడ మేము కఠినమైన బయోబబుల్‌లో ఉన్నాము. అయితే బబుల్ వీడి ఆస్ట్రేలియా తిరిగి రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం మా ప్రత్యేక విమానాన్ని స్వదేశంలోకి అనుమతిస్తుందని భావిస్తున్నాము’ అని లిన్ అభ్యర్థించాడు.

Next Story

Most Viewed