చిన్మయికి ఎదురుదెబ్బ

by  |
చిన్మయికి ఎదురుదెబ్బ
X

బ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో రాధారవికి పోటీగా నామినేషన్ వేసిన చిన్మయి శ్రీపాదకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వేసిన నామినేషన్‌ని డబ్బింగ్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. తాము పొందుపరిచిన సూచనలకు సరిపోల్చేలా లేదని నెపం చూపించి తిరస్కరించారు. దీంతో రాధారవి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయం గురించి చిన్మయి కోర్టుకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో లైంగిక వేధింపుల వ్యవహారంలో రాధారవి, చిన్మయి మధ్య వివాదం తలెత్తింది. రాధారవిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అయితే, ఆమె కోర్టును ఆశ్రయించి సంఘంలో మళ్లీ చోటు సంపాదించింది. సంఘం ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాధారవి మళ్లీ నామినేషన్ వేయగా, ఆయనకు పోటీగా చిన్మయి, కార్యదర్శి పదవికి మురళీకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, సంఘం నిబంధనల ప్రకారం చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Next Story

Most Viewed