చింగారి ‘కోటి’ రూపాయల ఆఫర్!

by  |
చింగారి ‘కోటి’ రూపాయల ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: టిక్ టాక్‌పై నిషేధం విధించాక, దానికి ఆల్టర్నేటివ్‌గా వచ్చిన దేశీ యాప్స్.. యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అందులో ‘చింగారి’ యాప్ కూడా ఒకటి. కాగా, ఇదే జోరును కంటిన్యూ చేసేందుకు చింగారి రెడీ అవుతోంది. ఈ క్రమంలో సొంతంగా సంగీతం క్రియేట్ చేయగల సంగీత కళాకారులు.. యాప్ ద్వారా డబ్బు గెలుచుకునే ఓ సూపర్ ఆఫర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్త సంగీతాన్ని, పాటలను సృష్టించి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ పాట రీచెబులిటీకి తగ్గట్టుగా డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. ఇప్పుడు మరింత కొత్తగా ఆలోచించి ‘డిజిటల్ టాలెంట్ హంట్ షో’కు తెరలేపింది. అదే ‘చింగారి స్టార్ : టాలెంట్ కా మహాసంగ్రామ్’. బెస్ట్ కంటెంట్ క్రియేటర్లుగా ఇందులో గెలుపొందిన వారు ఏకంగా రూ. కోటి గెలుచుకోవచ్చని ప్రకటించింది.

ప్రతి రాష్ట్రం నుంచి బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ. 5 లక్షలు అందించనున్నారు. స్టేట్, నేషనల్ లెవల్స్‌లో నిర్వహించనున్న ఈ కాంటెస్ట్‌లో ఎవరైనా పాల్గొనొచ్చు. ఎలాంటి అర్హతలు అవసరం లేదు. క్రియేటివిటీతో కంటెంట్ క్రియేట్ చేయగలా సత్తా ఉంటే చాలు.. ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందుకోసం మిమిక్రీ, కామెడీ, డాన్స్, యాక్టింగ్, ఇన్నోవేషన్, సింగింగ్, స్టాండప్ కామెడీ ఇలా భిన్న కేటగిరీల్లో వీడియోలు చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. తమకు ఏ టాలెంట్ ఉన్నా సరే, ఇక్కడ నిరూపించుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు 15 నుంచి 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోను అప్‌లోడ్ చేయాలని, ఫెర్మామెన్స్‌తో పాటు చింగారి యూజర్ల నుంచి లైవ్ ఓటింగ్ ఉంటుందని.. ఆల్ ఇండియా విన్నర్‌కు రూ. కోటి అందిస్తామని చింగారి యాప్ కోఫౌండర్ సుమిత్ ఘోష్ వెల్లడించారు. ఆగస్టు 25న విజేతన విజేత వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.

‘దేశీ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నాం. అంతేకాదు ప్రతిభ ఉంటే.. ఈ పోటీ ద్వారా వాళ్లంతా కూడా ఫేమస్ కావడంతో పాటు ధనవంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. దేశంలోని తొలి డిజిటల్ రియాలిటీ షో ఇదే. స్టేట్ విన్నర్స్ మూడు కొత్త వీడియోలు అందించాల్సి ఉంటుంది. నేషనల్, లోకల్ చానెల్స్ ద్వారా లైవ్ ఓటింగ్ నిర్వహిస్తాం’ అని సుమిత్ ఘోష్ తెలిపారు.



Next Story

Most Viewed