చైనా యూటర్న్.. భారత్‌తో చెలిమికి సై

by  |
చైనా యూటర్న్.. భారత్‌తో చెలిమికి సై
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, చైనా ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వాన్ లోయ సరిహద్దులో ఘర్షణ చోటుచేసుకుని 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని మోడీ సైతం సరిహద్దులో పర్యటించి, సైనికుల్లో ఉత్సాహం, ధైర్యం నింపాడు. అయితే ఘటన తరువాత భారత్ పట్టుబిగించింది. బోర్డర్‌లో వ్యూహాత్మకంగా సైనికులను మోహరిస్తూనే చైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు ఆ దేశానికీ చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించింది. ఆ తరువాత ప్రధాని మోడీ లడఖ్‌లో పర్యటించిన సమయంలో చైనా పేరు ప్రస్తావించకుండానే చైనా దురాగతంపై విమర్శలు చేశాడు. దీంతో చైనా షాక్ అయ్యింది.

అటు అగ్రరాజ్యం అమెరికా సైతం చైనాను విమర్శిస్తూ, ఇండియాకు సపోర్ట్ చేసింది. ఇండియాకు అనుకూలంగా బలగాలను దించుతామని హెచ్చరించింది. చైనా చేసిన తప్పుల వలన ప్రపంచం నేడు కరోనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. దాని నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు చైనా తన బలాన్ని చాటేందుకు గాల్వాన్ లోయ ఉదంతాన్ని సృష్టించింది.

అయితే, ఇండియా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడంతో చైనా కాళ్లబేరానికి వచ్చింది. ఇండియా తమకు శత్రుదేశం కాదని, శాశ్వత మిత్ర దేశం అని ఇండియాలోని చైనా రాయభారి సన్ విడాంగ్ పేర్కొన్నాడు. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటామని, ఇండియా చైనా మధ్య సంబంధాలు తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు.



Next Story

Most Viewed