‘హోంమంత్రి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై దర్యాప్తు చేస్తాం’

by  |
‘హోంమంత్రి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై దర్యాప్తు చేస్తాం’
X

వరంగల్ అర్బన్ : ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఎన్నికల చీఫ్ అబ్జార్వర్ శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ పై సైబర్ క్రైం వాళ్ళు చర్యలు తీసుకుంటారన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాల పై దర్యాప్తు చేస్తామని, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. కలెక్టర్లు, అధికారులు డిసిప్లైన్ తో పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని, ఈ సారి పోలింగ్ శాతం పెరగడం పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే క్రిమినిల్ కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. ఫేక్ ఓటర్లు పై ఆధారాలు చూపిస్తే దర్యాప్తు చేస్తామని తెలిపారు. 4 గంటల లోపు ఉన్నవాళ్ళందరికి ఓటు అవకాశం కల్పిస్తామన్నారు. ఎండ తీవ్రతకు అదనపు ఏర్పాట్లు చేస్తామని, అందరు సహకరించాలని కోరారు. శశాంక్ తోపాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీసీపీ పుష్ప, తదితరులు ఆయన తోపాటు ఉన్నారు.



Next Story

Most Viewed