‘కేసీఆర్ కుటుంబానికి రాజభోగాలు’

by  |
‘కేసీఆర్ కుటుంబానికి రాజభోగాలు’
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బతుకుకు భరోసా ఏదని, ఇంటికో ఉద్యోగం ఎక్కడ అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. మంగళవారం నాగార్జునసాగర్ (హిల్ కాలనీ)లో ఉద్యమ శక్తులు, నిరుద్యోగులు, అధ్యాపకులు, ప్రజా సంఘాల నేతలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఎవరి బతుకులు బాగుపడలేదన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు‌, కార్మికులు, కర్షకులు, సకలజనులు నైరాశ్యంలోనే వున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులది మేకపోతు గాంభీర్యమే తప్ప ఏనాడు యువత బతుకుల గురించి చట్టసభల్లో మాట్లాడలేదన్నారు. దొరగారి సంస్థానంలో బానిసలుగానే వ్యవహరించినరన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రాజభోగాలు అనుభవిస్తున్నది కేసీఆర్ కుటుంబం ఒక్కటేనన్నారు. విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రంలో పట్టభద్రులందరూ కలిసి శాసనమండలికి పంపిస్తే మీ తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తానని, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని చెరుకు సుధాకర్ అన్నారు.

Next Story

Most Viewed