బ్యాటింగ్ ఎంచుకున్న ధోని

by  |
బ్యాటింగ్ ఎంచుకున్న ధోని
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 37వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా.. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

ఐపీఎల్‌ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సారి ప్లేఆఫ్‌లో ఛాన్స్‌లో పోరాటం చేయాల్సి వస్తోంది. అద్భుతమైన స్టార్ బ్యాట్‌మెన్స్‌తో కూడి ఉన్న రాజస్థాన్ జట్టు కూడా ఈ సారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్న జట్లలో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Next Story