మంత్రివర్గ ఎజెండాలో కరోనాకు 33వ స్థానమా..? : చంద్రబాబు

by  |
మంత్రివర్గ ఎజెండాలో కరోనాకు 33వ స్థానమా..? : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. గతంతో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రోజువారీగా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో కరోనా కేసులు, మరణాల తీరుపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎజెండాలో 33వ అంశంగా చేర్చడంపై మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో కేవలం 13 లక్షల వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఎంటనీ ప్రశ్నించారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీనమేషాలు లెక్కించడం ప్రభుత్వానికి తగదన్నారు. వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మందులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రెండు వ్యాక్సిన్ డోసులు వేస్తే అమెరికాలో తీవ్రత తగ్గిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో ఆక్సిజన్, బెడ్ల కొరత తీవ్రంగా ఉందన్నారు.



Next Story

Most Viewed