జవహర్ నగర్‌లో దారుణం.. రోడ్డుపై వెళ్తున్న మహిళను..

by  |
జవహర్ నగర్‌లో దారుణం.. రోడ్డుపై వెళ్తున్న మహిళను..
X

దిశ, జవహర్ నగర్ : నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం మార్కెట్లో కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వెళ్తున్న ఓ మహిళ మెడ లోంచి చైన్ దొంగిలించారు చైన్ స్నాచర్స్.

ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీలో అలుగు లక్ష్మి(50) తన కూతురు తబిత(32)తో కలిసి నివాసం ఉంటుంది. ఆదివారం ఉదయం తన కూతురితో కలిసి బాలాజీ నగర్‌లో కూరగాయల కోసం వెళ్లి తిరిగి 9.55 గంటలకు ఇంటి గేటులోకి వెళ్ళే క్రమంలో వెనుక నుండి హోండా యాక్టివా మీద వచ్చిన దొంగలు.. అలుగు లక్ష్మి(50) మెడలో ఉన్న చైన్ దొంగిలించారు. బాధితురాలు తప్పించుకుని వారికి ఎదురు తిరిగినా ఫలితం దక్కకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed