ఎల్ఐసీ షేర్ల ద్వారా రూ. 25 వేల కోట్లను సేకరించే యోచనలో కేంద్రం

by  |
ఎల్ఐసీ షేర్ల ద్వారా రూ. 25 వేల కోట్లను సేకరించే యోచనలో కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ షేర్లను ఐపీఓ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించి రూ. 25 వేల కోట్ల వరకు నిధులను సేకరించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి ముందు సంస్థ బోర్డు, అకౌంటింగ్ ప్రమాణాల్లో మార్పులను అమలు చేయనుంది. షేర్ విలువకు సంబంధించి మదింపు ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం ఐపీఓకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎల్ఐసీ ఐపీఓలో దాదాపు 24 యాంకర్ ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారని సమాచారం. ఎల్ఐసీ సంస్థ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ కావడంతో ఇందులో 10 శాతం వాటాయే కనీసం రూ. లక్ష కోట్లు ఉంటుంది. ఎల్ఐసీ ఐపీఓకు రావడం ద్వారా భారత ఈక్విటీ మార్కెట్లలోనే అత్యధికమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యేందుకు అనుగుణంగా ఎల్ఐసీలో మార్పులు జరుగుతున్నాయి. సెబీ నిబంధనలకు తగినట్టుగా బోర్డు నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెబీ నిబంధనల ప్రకారం.. యాంకర్ ఇన్వెస్టర్లు నిర్ణయించిన ధరకు రూ. 10 కోట్ల వరకు పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంటుంది.

Next Story

Most Viewed