మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..?

by  |
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై తాజాగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే స్పందించారు. ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలపడం, అందులో ముంబై క్రైం బ్రాంచ్ యూనిట్ హెడ్ సచిన్ వాజే పేరు ఉండటం, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ.100కోట్లు కలెక్ట్ చేయమన్నారని, ఆ పనిని సచిన్ వాజేకు అప్పజెప్పారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సీఎం ఉద్ధవ్ థాకరే‌కు రాసిన లెటర్‌ గురించి, అందులోని అంశాలపై కేంద్ర మంత్రి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌కు వివరించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశానని, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోరుతూ ఆపీఐ(ఎ) తరపున ఆయనకు మెమోరాండం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ‘‘వికాస్ అగాఢీ కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయానని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించే వరకు ఎటువంటి విచారణ జరగదు’’ అని అథవాలే స్పష్టం చేశారు. అందుకోసం మహారాష్ట్రలో ప్రెసిడింట్ రూల్ విధించాలని ఆయన రామ్‌నాధ్ కోవిం‌ద్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed