థియేటర్లలో ‘50శాతానికి’ మించి అవకాశం

by  |
థియేటర్లలో ‘50శాతానికి’ మించి అవకాశం
X

న్యూఢిల్లీ: సినిమా థియేటర్లు 50శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నిర్వహించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం సడలించింది. సామర్థ్యంలో 50శాతం కంటే ఎక్కువ మంది వీక్షకులతో థియేటర్లు నడవవచ్చునని కొత్తగా విడుదల చేసిన అన్‌లాక్‌ నిబంధనల్లో వెల్లడించింది. అలాగే, ఇప్పటివరకు కేవలం స్పోర్ట్స్ పర్సన్‌లకే పరిమితం చేసిన స్విమ్మింగ్ పూల్స్‌ను అందరికీ అందుబాటులో ఉంచడానికి అనుమతించింది. అలాగే, మత, రాజకీయ సభలకు హాజరయ్యే వారి సంఖ్యా పరిమితిని రాష్ట్రాలకే వదిలేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల సడలింపులను అమలు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది.



Next Story

Most Viewed