ఆన్‌లైన్ క్లాసులపై కేంద్రం మార్గదర్శకాలు

by  |
ఆన్‌లైన్ క్లాసులపై కేంద్రం మార్గదర్శకాలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, గంటల తరబడి మొబైల్ ఫోన్లలో క్లాసులు వింటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

నర్సరీ పిల్లలకు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆన్ లైన్ క్లాసులను నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ 45 నిమిషాల కాలపరిమితి ఉన్న రెండు సెషన్లను మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 30 నుంచి 45 నిమిషాల కాలపరిమితి ఉన్న నాలుగు సెషన్లను నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Next Story

Most Viewed