రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన శ్మశానం

by  |
రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన శ్మశానం
X

దిశ, ఏపీ బ్యూరో: శ్మశానం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఒక గ్రామానికి చెందిన ప్రజలు శ్మశానాన్ని ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ మరో గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరుగ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని ఎగువరెడ్డివారిపల్లె గ్రామం సర్వే నంబరు 1లో 3ఎకరాల శ్మశాన వాటిక ఉంది. ఆ భూమిలో నరసింగాపురం గ్రామస్తులు ఆ భూమిలో కత్తులు, గొడ్డలతో చెట్లు తొలగించి చదును చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఎగువరెడ్డివారిపల్లె వాసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వీఆర్వో విజయ్‌ కుమార్, స్థానిక సర్పంచ్‌ రేవతి ప్రకాష్‌రెడ్డి, ఔరంగజేబు ఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం శ్మశానం రెడ్డివారిపల్లెకు చెందినదిగా నిర్ధారించారు. నరసింగాపురం గ్రామస్తులకు సర్ది చెప్పి..సమస్యను పరిష్కరించారు.


Next Story

Most Viewed