నా దందా.. నా ఇష్టం.. పేపర్లలో పిచ్చి రాతలు నన్నేమీ చేయలేవు..

by  |
నా దందా.. నా ఇష్టం.. పేపర్లలో పిచ్చి రాతలు నన్నేమీ చేయలేవు..
X

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని ఒక సెల్ ఫోన్ షాప్ వడ్డీలతో దందా చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. నా షాప్ నా దందా.. నా ఇష్టం.. నన్ను ఎవ్వరు ఆపలేరని సదరు వ్యాపారి.. ప్రజలతో దురుసుగా మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మండల ప్రజలతో మాట్లాడాడని విశ్వసనీయసమాచారం.

కొత్త ఫోన్లను అధిక ధరలకు విక్రయిస్తూ.. దానికి తోడు భారీ వడ్డీలు వేస్తూ ఖాతాదారులను మోసం చేస్తు్న్నారని ప్రజలు తెలుపుతున్నారు. ఈ విషయంపై స్థానికులు ప్రశ్నించగా.. నా గురించి, నా షాపు గురించి ఎన్ని పిచ్చి రాతలు రాసినా.. నన్ను ఏమీ చేయలేరని అసభ్యకర పదజాలంతో దూషించినట్టు తెలిసింది. డబ్బులు కోసం వాళ్ల ఇంటికి వెళ్తా.. వాళ్లను తిడతాను అంటూ దురుసుగా మాట్లాడినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇలాంటి వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు.. అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ షాప్ యజమాని నాకు పెద్ద అధికారులు తెలుసు, నన్ను వారే చూసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు సెల్ ఫోన్ యజమానికి సహకరించే ఆ అధికారులు ఎవరు..? అని మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు. దందాలకు అధికారులు సహకరిస్తే దందాలను ఆపేదేవరని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సెల్ ఫోన్ షాప్ పూర్తిగా యువతనే టార్గెట్ చేసిందన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏజెన్సీ నియోజకవర్గంలోని అమాయకమైన యువకులకు మాయమాటలు చెప్పి సెల్ ఫోన్స్ విక్రయిస్తూ అధిక వడ్డీలకు పాల్పడుతూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.

ఏజెన్సీ ప్రజలను, ఇతర వర్గాల ప్రజలను ఫైనాన్స్ పేరుతో నిండా ముంచుతున్నాడని పలువురు అంటున్నారు. నిజానికి ఇంత దందా జరుగుతున్న పోలీస్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ దందాని అరికట్టాలని, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed