అక్టోబర్ 10లోపే ఇంటర్ ఫలితాలు : CBSC

by  |
అక్టోబర్ 10లోపే ఇంటర్ ఫలితాలు : CBSC
X

దిశ, వెబ్‌డెస్క్ :

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 10 లేదా అంతకంటే ముందే 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని CBSC గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. మరోవైపు UGC సైతం వచ్చే నెల 31 నుంచే డిగ్రీ కోర్సులకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రారంభిస్తామని ధర్మాసనానికి చెప్పింది. ఆ సమయానికల్లా మళ్లీ పరీక్షలు రాసిన దాదాపు 2లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు విడుదలవుతాయని స్పష్టంచేసింది. ఈ ఏడాది వృథా కాకుండా కలిసికట్టుగా పనిచేస్తామంటూ ప్రకటించిన కొద్ది రోజులకే UGC, CBSCలు ఈ మేరకు వివరించాయి.

ఇంటర్ సెకండ్ ఇయర్ కంపార్ట్‌మెంట్ పరీక్షలు రాసిన వారికి కూడా కొత్త విద్యా సంవత్సరంలో చేరేలా అవకాశం కల్పిస్తామని రెండు బోర్డులూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని అటు సీబీఎస్ఈకు.. కాలేజీల్లో వీరికి ప్రవేశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అటు యూజీసీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

కొవిడ్-19 కల్లోలం కారణంగా అధికారులు విద్యార్థులకు తోడ్పాటు అందించాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఈ ఏడాది 12వ తరగతి కంపార్ట్‌మెంటు పరీక్షలు రాసిన విద్యార్ధులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ పై జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.



Next Story

Most Viewed