ఇక నుంచి వాటి అక్రమ రవాణా నేరం..

by  |
asembly news
X

డిస్పూర్: అస్సాం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లును ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల మొదటి రోజున అస్సాం గో సంరక్షణ చట్టం-2021ని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వశర్మ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను నిషేధించే ఉద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకురానున్నారు. ఈ చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి అస్సాంకు గోవులను అక్రమ రవాణా చేయడాన్ని నేరంగా పరిగణించనున్నారు.

వ్యవసాయం, పశుసంవర్థక అవసరాల కోసం పశువుల రవాణా చేసేందుకు గాను చట్టం ప్రకారం సంబంధిత అధికారి అనుమతులు తీసుకోవాలని బిల్లులో తెలిపారు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక అవసరాలకోసం గోవులను అదే జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలించాల్సినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం పేర్కొంది.



Next Story

Most Viewed