తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు

by  |
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్నార్ మల్లన్న పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతం మారుతి సేవా సమితి పేరుతో ఉన్న జ్యోతిష్యాలయ నిర్వాహకుడు లక్ష్మికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూమార్ తనకు ఫోన్ చేసి రూ. 30 లక్షలు ఇవ్వాలి, లేకపోతే నీపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తానని బెదిరించారన్నారు. తాను డబ్బులు ఇవ్వనని చెప్పడంతో తనపై తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగేలా చేశాడని లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Next Story