బ్రాత్‌వైట్ బ్యాటింగ్.. విండీస్ షైనింగ్ !

by  |
బ్రాత్‌వైట్ బ్యాటింగ్.. విండీస్ షైనింగ్ !
X

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ పేరు చెబితే మిగిలిన జట్లన్నీ గడగడలాడేవి. అరవీర భయంకర ఫాస్ట్ బౌలర్లు.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడే బ్యాట్స్‌మెన్‌కు ఆ జట్టు పెట్టింది పేరు. కానీ కాలక్రమంలో విండీస్ జట్టు తమ వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకనాటి ప్రపంచ విజేత చివరకు ప్రపంచ కప్‌లో చోటు కోసం అర్హత మ్యాచ్‌లు ఆడాల్సిన స్థితికి చేరుకుంది. కానీ, టీ20లు ఎప్పుడైతే రంగప్రవేశం చేశాయో.. తిరిగి అక్కడి కొత్త తరం క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. పొలార్డ్, గేల్, బ్రాత్‌వైట్, సునిల్ నరైన్ వంటి హార్డ్ హిట్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. అయితే, వీరంతా విడివిడిగా ఇతర లీగ్స్‌లో ఆకట్టుకునా.. జట్టుగా మాత్రం విండీస్‌కు ఎలాంటి కప్ అందించలేకపోవడం వెలితిగా ఉండేది. ఎట్టకేలకు వారి ఆశలను 2016 టీ20 ప్రపంచ కప్ తీర్చింది. అప్పటిదాకా జట్టులో అనామకుడిగా ఉన్న బ్రాత్‌వైట్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌తో హీరోగా మారిపోయాడు.

నాలుగేండ్ల కిందట ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్-విండీస్ జట్లు తలపడ్డాయి. విండీస్ జట్టు విజయం సాధించాలంటే.. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో బ్రాత్‌వైట్.. బంతి బెన్ స్టోక్స్ చేతిలో. ఇక విజయం నల్లేరు మీద నడకేనని ఇంగ్లాండ్ జట్టు అభిమానులు అప్పటికే సంబరాల్లో మునిగిపోయారు. అప్పుడు జరిగింది మ్యాజిక్..! వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్.. చాన్నాళ్లకు విండీస్ జట్టుకు ఐసీసీ కప్ అందించాడు. ఆ మ్యాచ్ తర్వాత బ్రాత్‌వైట్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా అభిమానులు వెంటపడే వారంట. అంతే కాదు ఇండియాలోని అభిమానులైతే అతడిని ఏకంగా క్రిస్ గేల్‌తో పోల్చేవారంట. ఈ విషయాలన్నీ బ్రాత్‌వైట్ తాజాగా బయటపెట్టాడు. ‘భారత్‌లో క్రికెట్ అనేది ఒక మతం లాంటిది. నేను ఒక సారి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుంటే అభిమానులు చుట్టుముట్టారు. ఆ వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ ఆడేందుకు వచ్చినప్పుడు సైతం అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఏదేమైనా ఆ మ్యాచ్ నా జీవితాన్ని మలుపుతిప్పిందని బ్రాత్‌వైట్.. ఆ వరల్డ్ కప్ విశేషాలను పంచుకున్నాడు.

tags : ICC T20, 2016, England, Ben stokes, Carlos Brathwaite, West Indies


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed