నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి..

by Dishafeatures1 |
నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 145

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మే 7

*పరీక్ష తేది: 2022 జూన్ 12

*ఇందులో స్పెషలిస్ట్ ఆపీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*మేనేజర్‌ (రిస్క్‌) పోస్టులు 40, మేనేజర్‌ (క్రెడిట్‌) పోస్టులు 100, సీనియర్‌ మేనేజర్‌ (ట్రెజరీ) పోస్టులు 5 వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సీఏ/సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ తో ఏంబీఏ(ఫైనాన్స్)/ పీజీ డిగ్రీ పాసై ఉండాలి.

*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఆన్ లైన్ రాత పరీక్ష 220 మార్కులకు కేటాయిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు నిర్వహిస్తారు.

*దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.pnbindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story

Most Viewed