అవుతారా.. ఆర్మీ ఆఫీసర్ (NDA & NA ఎగ్జామ్ (II)-2023)

by Disha Web Desk 7 |
అవుతారా.. ఆర్మీ ఆఫీసర్ (NDA & NA ఎగ్జామ్ (II)-2023)
X

దిశ, కెరీర్: ఆర్మీ, నేవీతోపాటు ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశానికి UPSC.. ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్‌తో సహా డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడానికి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ పరీక్ష ఒక గేట్‌వే లాంటిది. ఇది సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. NDA & NA ఎగ్జామ్ (II)- 2023 నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ముందుగా రాత పరీక్ష రాయాలి, ఆపై సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) నిర్వహించే ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. ఎంపిక, ప్రవేశ పరీక్ష మార్గదర్శకాలను యూపీఎస్సీ జారీ చేస్తుంది.

దేశానికి సేవ చేయడంతోపాటు మంచి కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ సువర్ణావకాశం. ఈ ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతీ ఏడాది రెండు సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ, ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2023 ఏడాదికి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో జులై 7, 2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడింది. వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 ఉన్నాయి. వీటిలో ఆర్మీ -208, నేవీ -42, ఎయిర్ ఫోర్స్ -120 ఉన్నాయి. 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు ఉండగా నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.

అర్హులు ఎవరంటే:

ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేసే వారు ఫిజిక్స్, మ్యాథ్స్, సబ్జెక్టులతో ఇంటర్ కోర్సు ఉత్తీర్ణత సాధించాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షా విధానం:

పేపర్ -1 మ్యాథమేటిక్స్ - 300 మార్కులకు ఉంటుంది. దీనికి సమయం రెండున్న గంటలు.

పేపర్ - 2 జనరల్ ఎబిలిటీలో 600 మార్కులుంటాయి. దీనికి సమయం రెండున్నర గంటలు.

నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.

రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ వంటి టెస్ట్ లను నిర్వహిస్తారు. రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కోర్సులు ఇవే:

నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న కోర్సును ఉచితంగా పూర్తి చేయవచ్చు.

ఉచిత శిక్షణ:

ఎంపికైన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, ట్రైనిగ్ పూర్తి చేస్తారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి, నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్‌లు హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ తీసుకుంటారు. ఎంపికైన విభాగాన్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ సంవత్సరం నుంచి ఏడాదిన్నర ట్రైనింగ్ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ ఎయిర్ ఫోర్స్ లో ప్రారంభస్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రాంభించవచ్చు.

ఇతర వివరాలు:

వయసు: అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు జనవరి 2, 2005కి ముందు, జనవరి 1, 2008కి తర్వాత జన్మించి ఉండరాదు.

దరఖాస్తు: దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

పరీక్షఫీజు: రూ. 100 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 6, 2023.

అభ్యర్థులు జూన్ 7 నుంచి జూన్ 13 వరకూ దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్ రాతపరీక్ష: సెప్టెంబర్ 3, 2023.

కోర్సులు ప్రారంభ తేదీ: జూలై 2, 2024

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

వెబ్‌సైట్: https://upsconline.nic.in/


Next Story

Most Viewed