JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష తేదీల్లో మార్పు..

by Disha Web Desk 20 |
JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష తేదీల్లో మార్పు..
X

దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష తేదీని మార్చింది. అలాగూ NTA పరీక్ష సవరించిన తేదీ షీట్‌ను కూడా విడుదల చేసింది. సవరించిన పరీక్ష తేదీ షీట్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో విడుదల చేశారు. వీటిని అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను ఇప్పటికే విడుదల చేసింది.

NTA జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఈ పరీక్షను 2024 ఏప్రిల్ 4 నుంచి 15 వరకు నిర్వహించాల్సి ఉంది. పేపర్ 1 BE/B.Tech ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరుగుతుంది. ఏప్రిల్ 12న పేపర్ 2 బి.ఆర్క్, బి.ప్లానింగ్ పరీక్ష ఉంటుంది.

ఇక పేపర్ 1ని రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పేపర్-2 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీని చెక్ చేసుకోండి..

jeemain.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

పరీక్ష నగర స్లిప్ లింక్‌ పై ఇక్కడ క్లిక్ చేయాలి.

మీ స్క్రీన్‌ పై PDF కనిపిస్తుంది.

ఇప్పుడు సవరించిన పరీక్ష తేదీని చెక్ చేసుకోండి.

JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు NTA ద్వారా జారీ చేస్తారు. JEE మెయిన్ 2024 సెషన్ 2 కోసం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేయడంలో ఎవరైనా అభ్యర్థికి సమస్య ఉంటే, వారు హెల్ప్‌లైన్ నంబర్ 011-40759000ని సంప్రదించవచ్చు. లేదా [email protected] Are కి మెయిల్ చేయవచ్చు. సెషన్ 1 పరీక్ష జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. సెషన్ 2 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు NTA వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Next Story

Most Viewed