IIT JAM 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

by Disha Web Desk 20 |
IIT JAM 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ IIT JAM 2024 పరీక్ష ఫలితాలు వెల్లడించారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ jam.iitm.ac.inలో విడుదల చేశారు. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా వారి స్కోర్‌లను తనిఖీ చేయవచ్చు. ఫిబ్రవరి 11న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేవలం ఇంగ్లీషులో మాత్రమే జరిగింది.

మొదటి షిప్టులో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిప్టులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మూడు గంటల పాటు ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు 60 ప్రశ్నలు అడిగారు.

IIT JAM 2024 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి ?

IIT JAM అధికారిక వెబ్‌సైట్ jam.iitm.ac.inని సందర్శించాలి.

హోమ్ పేజీలో IIT JAM 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.

లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించాలి.

ఫలితం మీ స్క్రీన్‌ పై కనిపిస్తుంది.


Next Story

Most Viewed