- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చుట్టూ పత్తి చేను.. మధ్యలో గంజాయి సాగు
దిశ, ఆసిఫాబాద్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం కొత్తగూడ (మొర్రిగూడ )గ్రామానికి చెందిన పెంద్రం శంకర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయన తన పొలంలో పత్తి మొక్కల మాటున గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు తెలియడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు రెబ్బెన సీఐ ఎస్ సతీశ్ కుమార్ తెలిపారు. ఆదివారం రెబ్బెన సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిర్యానీ ఎస్ఐ పి రామారావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. మొర్రిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ ఇంటి, పెరడు, చేన్లలో అధిక డబ్బులకు ఆశపడి గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.
ఈ క్రమంలోనే పత్తి, కంది చేన్ల మధ్యలో అక్కడక్కడా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న చోట్ల స్పెషల్ పార్టీ బృందంతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించగా పెంద్రం శంకర్ పత్తి చేనులో 19 గంజాయి మొక్కలు లభించాయన్నారు. వెంటనే ఎస్‌ఐ తహశీల్దార్‌కు సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ తహసీల్దార్ మాస్కుర్ అలీ తన సిబ్బందితో వచ్చి పంచనామా నిర్వహించారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం అతన్ని, గంజాయి మొక్కలను తిర్యానీ పోలిసులకు అప్పజెప్పారు.ఈ మేరకు వారు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్టు తెలిపారు. ఇకమీదట ఎవరైనా గంజాయి మొక్కలను సాగుచేసినా, అమ్మినా, సరఫరా చేసినా కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో తిర్యానీ ఎస్ఐ పి.రామారావు సిబ్బంది బాపు, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు.