పీఎం మోడీ నియోజకవర్గానికి రావొద్దు : అధికారుల విన్నపం

by  |
పీఎం మోడీ నియోజకవర్గానికి రావొద్దు : అధికారుల విన్నపం
X

లక్నో : ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి రావొద్దని జిల్లా అధికారులు పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. వారణాసిలో కరోనా కేసుల విజృంభణే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో వారణాసిని సందర్శించాలని ప్లాన్ చేసుకున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు తమ ట్రిప్‌ను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు.

ఈ మేరకు వారణాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ స్పందిస్తూ… ‘ఏప్రిల్ నెలలో వారణాసి రావాలనుకున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకోండి’ అని తెలిపారు. గతనెల 31 న వారణాసిలో 116 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 5 నాటికి అవి 550 కి పెరిగాయి. ఇక బుధవారం వారణాసిలో 1,585 మందికి పాజిటివ్ తేలింది. గడిచిన రెండు వారాల్లోనే కొవిడ్ కేసులు భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నదని అధికారులు వివరించారు. వారణాసి పక్కన ఉన్న జిల్లాల ప్రజలు కూడా అత్యవసరమైతేనే ఇక్కడికి రావాలని వారు సూచిస్తున్నారు. వారణాసిలో ప్రస్తుతం 10,206 యాక్టివ్ కేసులున్నాయి. యూపీలో లక్నో, ప్రయాగ్‌రాజ్ తర్వాత అత్యధిక క్రియాశీలక కేసులున్న నగరంగా వారణాసి ఉన్నది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story