బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఉన్నతస్థాయి ప్యానెల్ మీటింగ్

by  |
బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఉన్నతస్థాయి ప్యానెల్ మీటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మరింత వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ)ల ప్రైవేటీకరణ నేపథ్యంలో కేంద్ర కార్యదర్శుల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్యానెల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రైవేటీకరణకు సంబంధించి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రణాళికను సంబంధిత మంత్రిత్వ శాఖ వర్గాలకు పంపనున్నట్టు తెలుస్తోంది. వివిధ నియంత్రణ, పరిపాలనా సమస్యలను గుర్తించి, పెట్టుబడుల ఉపసంహరణ, లేదా ఆల్టర్నేటివ్ మెకానిజం కోసం ప్రతిపాదనను పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాలు, కార్పొరేట్, ఆదాయ, వ్యయ, న్యాయ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే, దీపమ్ కార్యదర్శి, ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఓ బీమా సంస్థను ప్రైవేటీకరిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రైవేటీకరణకు బ్యాంకుల ఎంపిక బాధ్యత నీతి ఆయోగ్‌కు అప్పగించారు. ఈ ప్రైవేటీకరణ ద్వారా కేంద్రం మొత్తం రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే నీతి ఆయోగ్ నివేదికను ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్, ఐఓబీల ప్రైవీటీకరణను సిఫార్సు చేసింది.


Next Story

Most Viewed