దేశవ్యాప్తంగా 1,000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు అవసరం

by Disha Web Desk 16 |
దేశవ్యాప్తంగా 1,000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు అవసరం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు, 400 ఆటోమెటెడ్ ఫిట్‌నెస్ పరీక్షా కేంద్రాలు అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (డిజిఈఎల్‌వీ) ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. దేశవ్యాప్తంగా 85 వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలకు రోడ్డు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుతం డిపాజిట్ సర్టిఫికేట్(సీడీ) ఉన్న ఎవరైనా ప్లాట్‌ఫామ్ ద్వారా దాన్ని విక్రయించవచ్చని, రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్ఎఫ్) వద్ద స్క్రాప్ చేసేందుకు వాహనాన్ని ఇచ్చినపుడు సీడీ జారీ చేయబడుతుందన్నారు. భవిష్యత్తులో సర్క్యులర్ ఎకానమీ వల్ల దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని గడ్కరీ పేర్కొన్నారు. స్క్రాపింగ్ పాలసీ ద్వారా పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనే కొత్త వాహనాలకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిప ప్రాంతాలు రోడ్ ట్యాక్స్‌పై 25 శాతం వరకు పన్ను రాయితీ పొందవచ్చని గడ్కరీ వెల్లడించారు.



Next Story

Most Viewed