Airtel కు భారీ జరిమానా విధించిన TRAI..!

by Disha Web Desk 17 |
Airtel కు భారీ జరిమానా విధించిన TRAI..!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు నియంత్రణ సంస్థ ట్రాయ్ భారీ జరిమానా విధించింది. 2021, డిసెంబర్ త్రైమాసికంలో అనధికారిక కమర్షియల్ కాల్స్‌ను నియంత్రించడంలో విఫలమైన కారణంగా ట్రాయ్ రూ.2.81 కోట్ల పెనాల్టీ విధించింది. ఇది టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్-2018 నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, అందుకే జరిమానా విధించినట్టు ఎయిర్‌టెల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ట్రాయ్ ఆదేశాలను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం గురించి తెలియజేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ట్రాయ్ వినియోగదారులకు ఇబ్బందికరమైన, మోసపూరిత మేసేజ్‌ల ముప్పును తనిఖీ చేసేందుకు టెలికాం కంపెనీలు పరస్పరం డేటాను పంచుకోవాలని కోరింది. ఇదివరకు అనధికారిక కాల్స్, మేసేజ్‌లపై టెలికాం కంపెనీల నుంచి ట్రాయ్ డేటాను సేకరించింది.

ఇవి కూడా చదవండి : భారీ స్థాయిలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న వేదాంత!


Next Story

Most Viewed