అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి వివిధ వస్తువుల ధరల్లో రానున్న భారీ మార్పులు!

by Disha Web Desk 17 |
అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి వివిధ వస్తువుల ధరల్లో రానున్న భారీ మార్పులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఏప్రిల్ 1 నుంచి ప్రజలు రోజువారీ ఉపయోగించే వివిధ రకాల వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి, అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ఇటీవల 2023-24 బడ్జెట్ సబ్మిషన్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రకాల వస్తువుల ధరలు పెంచడం, తగ్గించడంపై ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా కస్టమ్స్ సుంకాలు, ట్యాక్స్, పన్ను స్లాబ్‌లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఏ ఏ వస్తువుల ధరల్లో ఎంత మార్పులు వస్తాయో ఒకసారి చూద్దాం..

ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గే వస్తువులు..

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం, ఇండియాలో తయారైన వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దేశీయంగా తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, కెమెరా లెన్స్‌లు, భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు, ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, టీవీలు మొదలగు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం వీటిపై సుంకాలను తగ్గించడం ద్వారా ప్రజలకు ఇవి చాలా తక్కువ ధరలో లభించనున్నాయి.

ధరలు పెరిగేవి..

బడ్జెట్ ప్రకారం, సిగరెట్లు, వెండి, బంగారు కడ్డీలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, దిగుమతి చేసుకున్న బొమ్మలు, సైకిళ్లు, దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వాహనాలు ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. నిర్దేశిత సిగరెట్లపై కస్టమ్స్ సుంకాన్ని 16 శాతం పెంచారు. కిచెన్ చిమ్నీలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుండి 15 శాతానికి పెంచారు. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి.

Read more:

గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌ పే యూజర్లకు గుడ్ న్యూస్.. NPCI కీలక ప్రకటన



Next Story

Most Viewed