Bank Holiday in May 2023: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్

by Dishanational2 |
Bank Holiday in May 2023: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యగమనిక. చాలా మంది బ్యాంకుల సెలవు దినాలు తెలుసుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. దీనివలన ఇబ్బందుల్లో పడుతారు. అలాంటి వారి కోసమే ఈ ముఖ్యమైన సమాచారం. బ్యాంకు సెలవులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఇంపార్టెంట్ వర్క్స్ త్వరగా పూర్తి చేసుకోవచ్చు.

ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది.అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మారుతుంటాయి. కాగా, ఆర్‌బీఐ మే నెలలో బ్యాంకుల సెలవు దినాల జాబితాను విడుదల చేసింది. ఇక ఈనెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

ఇక ఏరోజు ఏరోజు సెలవులో ఇప్పుడు చూద్దాం..

మే 1, 2023: మహారాష్ట్ర డే/మే డే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా మరియు త్రివేండ్రం లో సెలవులు.

మే 5, 2023: బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులు క్లోజ్.

మే 7- ఆదివారం

మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతిచ..కోల్‌కతాలో బ్యాంకులు క్లోజ్.

మే 13 – రెండో శనివారం

మే 14- ఆదివారం

మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)

మే 21- ఆదివారం

మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి సిమ్లాలో బ్యాంకులు క్లోజ్.

మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి త్రిపురలోని బ్యాంకులు క్లోజ్.

మే 27- నాలుగో శనివారం

మే 28- ఆదివారం

Also Read...

30 శాతం వృద్ధిని నమోదు చేసిన ICICI బ్యాంక్




Next Story

Most Viewed