మా వెనక చెత్త ఉంది: విస్తారా సీఈఓ

by Disha Web Desk 17 |
మా వెనక చెత్త ఉంది: విస్తారా సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా విస్తారా తన విమాన సర్వీసులకు సంబంధించి తీవ్ర అంతరాయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పైలట్లు ముకుమ్మడిగా సెలవులు పెట్టడంతో విమానాల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తుంది. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ విస్తారా తన సామర్థ్యాన్ని 10 శాతం లేదా రోజూ 25-30 విమానాలను తాత్కాలికంగా తగ్గించుకుంది. దీనిపై తాజాగా విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ ఉద్యోగులకు లేఖ రాశారు. మార్చి 25-28 మధ్యకాలంలో 200 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడవగా, 150 విమానాలను రద్దు చేయడం జరిగింది. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కార్యకలాపాలు స్థిరీకరించబడ్డాయి. మా వెనక చెత్త ఉంది, సమస్యల పరిష్కారానికి మరింత మెరుగ్గా ప్లాన్ చేయాల్సి ఉంది. కస్టమర్లు ఆందోళన, నిరుత్సాహం చెందారు. ఎయిర్‌లైన్ మే 24 నాటికి కొత్త ప్రణాళికలను అభివృద్ధి చేస్తుంది, కొంత వరకు సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆన్-టైమ్ పనితీరు 9 ఏప్రిల్ 2024 న 89 శాతానికి పెరిగిందని కణ్ణన్ అన్నారు.ప్రస్తుతం విస్తారాలో 6500 మంది సిబ్బంది ఉండగా, వారిలో 1000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. గత నెల ప్రారంభంలో ATC ఆలస్యం, పక్షుల అడ్డంకి, నిర్వహణ కార్యకలాపాలతో సహా అంతరాయాల కారణంగా చాలా విమానాలు రద్దు చేయడం అలాగే, కొన్ని ఆలస్యంగా నడిచాయని కణ్ణన్ అన్నారు.

Next Story

Most Viewed