- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
పార్లమెంట్ ప్రారంభం రోజే కొత్త నాణెం విడుదల!

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరో కొత్త నాణేన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటు భవనం గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయనున్నట్లు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న భారతదేశానికి నివాళిగా కూడా ఈ నాణెం ఉపయోగపడుతుందని తెలిపింది. 35 గ్రాముల బరువు, 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ మిశ్రమాలతో తయారు చేశారు.
ఈ నాణేనికి ఒక వైపు అశోక స్తంభం, లయన్ క్యాపిటల్, దాని కింద ‘సత్యమేవ జయతే’ అని ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడివైపున ఆంగ్లంలో భారత్ అనే పదం రాయబడి ఉంటుంది. ఈ కాయిన్‌పై రూపీ సింబల్‌తో పాటు అంతర్జాతీయ అంకెల్లో డినామినేషన్ వాల్యూగా 75 ఉండనుంది. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో ‘సంసద్ సంకుల్’, దిగువ అంచున ఆంగ్లంలో ‘పార్లమెంట్ కాంప్లెక్స్’అనే పదాలు రాయబడి ఉంటాయి. నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 సెరేషన్‌లను కలిగి ఉంటుంది.
Read more: