ప్రధాని మోడీని చంపేస్తామంటూ అర్ధరాత్రి ఫోన్!

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీని చంపేస్తామంటూ అర్ధరాత్రి ఫోన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని హత్యచేయబోతున్నట్లు ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ ఢిల్లీ పోలీసులను టెన్షన్ పెట్టించింది. మోడీని హత్య చేయబోతున్నట్లు గురువారం అర్ధరాత్రి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఢిల్లీలోని కరోల్ బాగ్‌కు చెందిన 48 ఏళ్ల హేమంత్ కుమార్‌గా గుర్తించారు. అతడినిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి ఈ బెదిరింపు కాల్‌పై ఆరా తీస్తున్నారు. అయితే అతడు గత ఆరేళ్లుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడని, మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు.

Next Story