హార్లే డేవిడ్‌సన్ నుంచి సరికొత్త బైక్

by Disha Web Desk 17 |
హార్లే డేవిడ్‌సన్ నుంచి సరికొత్త బైక్
X

దిశ, వెబ్‌డెస్క్: హార్లే డేవిడ్‌సన్, హీరో మోటోకార్ప్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా మొదటి బైక్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ పేరు ‘హార్లే డేవిడ్‌సన్ X440 రోడ్‌స్టర్’. ఇది జులై, 2023 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. బైక్ ధర రూ. 3 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో పూర్తిగా డిజిటల్ LED సెటప్‌, రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌‌ను కలిగి ఉంటుంది. ముందు చక్రం 18 అంగుళాలు, వెనుక 17 అంగుళాలు ఉన్నట్లు తెలుస్తోంది. 440cc సింగిల్-సిలిండర్ ఇంజన్, 40Nm కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అలాగే, హెడ్‌ల్యాంప్ మధ్యలో 'హార్లే-డేవిడ్‌సన్' బ్రాండింగ్‌ను కూడా అందించనున్నారు.

Next Story

Most Viewed