కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 10 పైసలు .. టాటా నుంచి సరికొత్త ఈ-బైక్

by Disha Web Desk 17 |
కిలోమీటర్ ప్రయాణానికి  కేవలం 10 పైసలు .. టాటా నుంచి సరికొత్త ఈ-బైక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటం కారణంగా ప్రతి ఒక్కరు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ బైక్‌లు, ఈవీ కార్ల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అలాగే, వీటితో పాటు సైకిల్ మాదిరిగా ఉండే ఈ-బైక్స్‌కు కూడా ఆదరణ ఉండటంతో వివిధ కంపెనీలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్తగా వెరైటీ డిజైన్లతో వీటిని లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా కంపెనీకి చెందిన స్ట్రైడర్ నుంచి లేటెస్ట్ ఎడిషన్ ఈ-బైక్స్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి.



కొత్త ఈ బైక్ పేరు ‘స్ట్రైడర్ జీటా (Stryder Zeeta)’. దీని ధర రూ. 31,999. కానీ కంపెనీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా 20 శాతం తగ్గింపును అందిస్తుంది. అంటే దీనిని రూ.25,599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్‌ను పూర్తిగా చార్జ్ చేస్తే హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అదే పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో అయితే 25 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని గరిష్ట వేగం 25 కిలోమీటర్లు.


ప్రతీ కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసల ఖర్చు మాత్రమే అవుతుందని, 100 కిలోమీటర్లకు రూ.10 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ పేర్కొంది. దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి 3 గంటల టైం పడుతుంది. అన్ని రకాల రోడ్లపై ఇది సులువుగా రైడ్ చేస్తుందని, గ్రీన్, గ్రే కలర్స్‌‌లో, 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్‌తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ బ్యాటరీ, మోటార్‌కు రెండేళ్ల వారెంటీ లభిస్తుంది.

Also Read...

పీఎం కిసాన్ రూ. 2000 అకౌంట్లోకి రాలేదా..? అయితే ఇలా చేయండి!

Next Story

Most Viewed