- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
త్వరలో టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ మరో ఐపీఓను తీసుకురానుంది. గతేడాది ఆఖరులో దశాబ్దాల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓను విజయవంతం చేసిన సంస్థ ఈసారి తన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగాన్ని మార్కెట్లలోకి తీసుకురానుంది. టాటా గ్రూప్ ఈవీ విభాగం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(టీపీఈఎం) పబ్లిక్ చేయనుంది. ఈవీ వ్యాపారంలో కంపెనీ తన పెట్టుబడి మార్గాలను విస్తరించేందుకు, నిధులను సమీకరించాలని భావిస్తోంది. తాజా కథనాల ప్రకారం, టాటా గ్రూప్ ఈవీ విభాగం స్టాక్ మార్కెట్ల నుంచి సుమారు రూ. 8,300 నుంచి రూ. 16,500 కోట్ల మధ్య పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈవీ రంగంలో డిమాండ్, అమ్మాకాలు, సెంటిమెంట్ ఇప్పుడున్న ధోరణిలో బలంగా ఉంటే మరో 12-18 నెలల్లో అంటే 2024-25 లేదా 2025-26 ఆర్థిక సమవత్సరాలు ముగిసే లోపు లిస్టింగ్ చేయనుంది. టీపీఈఎం కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థగా ఉంది. కంపెనీ దేశీయ ఈవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా మోడల్స్ నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలను కలిగి ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్ దేశీయంగా ఈవీ మార్కెట్లో 80 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాబోయే 3-4 ఏళ్లలో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 10 ఈవీలు ఉండాలని భావిస్తోంది.