అదానీ గ్రూప్‌పై ఆరోపణల దర్యాప్తునకు సెబీకి గడువు పొడిగింపు!

by Disha Web Desk 17 |
అదానీ గ్రూప్‌పై ఆరోపణల దర్యాప్తునకు సెబీకి గడువు పొడిగింపు!
X

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు పొడిగింపును మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పార్దివాలాతో కూడిన ధర్మాసనం నిరవధిక పొడిగింపు ఇవ్వలేమని పేర్కొంది.

ఇదివరకు మే 2 లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆరు నెలల పొడిగింపును అడిగింది. ఇప్పటికే రెండు నెలల గడువు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఆగస్టు వరకు పొడిగించాం. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో, కంపెనీ షేర్ల విలువ భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read..

ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న రిలయన్స్, అదానీ కంపెనీలు!

Next Story

Most Viewed