ప్రజలకు తీపి వార్త చెప్పిన కేంద్రం!

by Disha Web Desk 17 |
ప్రజలకు తీపి వార్త చెప్పిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కొత్త 2023-24 ఆర్థిక సంవత్సరంలో శుభవార్త అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 70 బేసిస్ పాయింట్లు(0.70 శాతం) పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ పెంపు 2023, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, అన్ని పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వడ్డీ రేట్లు పెరిగాయి.

గత 9 నెలల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచడం ఇది మూడోసారి. ప్రస్తుతం వీటి వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 8.2 శాతం మధ్య ఉన్నాయి. అయితే, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ల వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేదు. అదే ఏడాది పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, 2 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీని 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు.

3 ఏళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌కు 6.2 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు అధికంగా 8.2 శాతం, మంత్లీ ఇన్‌కమ్ సేవింగ్స్ స్కీమ్‌కు 7.4 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌కు 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రకు 7.5 శాతం(115 నెలల్లో మెచ్యూర్ అయ్యేవాటికి), సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8 శాతం వడ్డీ అమలవుతుంది. కాగా, ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరిస్తుందనే విషయం తెలిసిందే.


Next Story

Most Viewed