భారత్‌లో పూర్తిగా కార్యకలాపాలను మూసేసిన టిక్‌టాక్!

by Disha Web Desk 17 |
భారత్‌లో పూర్తిగా కార్యకలాపాలను మూసేసిన టిక్‌టాక్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ షార్ట్ వీడియో యాప్, భారత్‌లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న టిక్‌టాక్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసినట్టు, భారత్‌లోని ఉద్యోగులందరినీ తొలగించినట్టు తెలుస్తోంది. దీనివల్ల 40 మంది ప్రభావితమయ్యారని, భారత్ కేంద్రంగా దుబాయ్, బ్రెజిల్ మార్కెట్ల కోసం పనిచేస్తున్న అందరిని ఇంటికి పంపినట్టు ఓ నివేదిక పేర్కొంది.

తొలగించబడిన ఉద్యోగులందరికీ కంపెనీ 9 నెలల వేతనాన్ని అందజేసింది. మూడేళ్ల క్రితం కంపెనీ దేశీయంగా నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేకమార్లు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉద్యోగులందరినీ తీసేయడంతో ఇక టిక్‌టాక్ కార్యాలయాలను పూర్తిగా మూసేయనుంది. నివేదిక ప్రకారం, టిక్‌టాక్ ఇండియా ఉద్యోగులకు ఫిబ్రవరి 28వ తేదీ చివరి రోజని, చైనా యాప్‌లపై భారత ప్రభుత్వ వైఖరి కారణంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం కుదరడంలేదని, తొలగించబడే ఉద్యోగులకు ఇతర అవకాశాల కోసం అవసరమైన సహకారం లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed