ఐదేళ్లలో యూనికాన్ హోదా కోల్పోయిన ఏడు స్టార్టప్ కంపెనీలు!

by Disha Web Desk 17 |
ఐదేళ్లలో యూనికాన్ హోదా కోల్పోయిన ఏడు స్టార్టప్ కంపెనీలు!
X

న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నిధులను రాబట్టడంతో పాటు చివరి దశ ఒప్పందాల్లో వెనక్కి వెళ్లి పోతున్న కారణంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదాను కోల్పోతున్నాయి. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీలను యూనికార్న్‌లుగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే.

మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు నిధులు సేకరించలేక పోతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా దేశంలో 2018-2022 మధ్య 105 స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదాను పొందాయి. గత ఐదేళ్లలో దాదాపు ఏడు భారతీయ స్టార్టప్ కంపెనీలు తమ యూనికాన్ హోదాను కోల్పోయాయి. ఇందులో క్వికర్, హైక్ కంపెనీలతో పాటు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటీఎం కంపెనీలు ఉన్నాయి.

గత రెండేళ్లలో దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక వాల్యూయేషన్ కలిగిన వాతావరణంలో ఉన్నాం. ప్రస్తుతం యూఎస్ టెక్ స్టాక్స్ బలహీనంగా ఉండటంతో దీనివల్ల భారత కంపెనీలపై ప్రభావం ఉంటుందని బెర్టెల్స్‌మన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎండీ పంకజ్ మక్కర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed