వ్యాపారాలను మూడు భాగాలుగా విభజించిన సికోయా కేపిటల్!

by Disha Web Desk 17 |
వ్యాపారాలను మూడు భాగాలుగా విభజించిన సికోయా కేపిటల్!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ దిగ్గజం సికోయా తన వ్యాపారాలను విభజించాలని నిర్ణయించింది. చైనా, భారత్, ఆగ్నేయాసియా వ్యాపారాలను స్వతంత్ర సంస్థలుగా విభజించాలని భావిస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. సంస్థ బ్రాండింగ్ విభజన ప్రక్రియను 2024, మార్చి 31 నాటికి పూర్తవుతుందని కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్స్ రొలొఫ్ బోథా, చైనా హెడ్ నీల్ షెన్, ఇండియా హెడ్ శైలేంద్ర సింగ్ వెల్లడించారు.

విడిపోయిన తర్వాత సంస్థకు చెందిన యూఎస్, యూరప్ వెంచర్ వ్యాపారం సికోయా కేపిటల్‌గా కొనసాగనుంది. గత కొంతకాలంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య నిధుల సేకరణ సంస్థకు అతి పెద్ద సవాలుగా మారింది. వెంచర్ ఫండ్‌ల రాబడి క్షీణిస్తున్న నేపథ్యంలోనే సికోయా తాజా నిర్ణయం తీసుకుంది.

గడిచిన 17 ఏళ్లలో సికోయా ఇండియా, ఆగ్నేయాసియా 400 కంటే ఎక్కువ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. అందులో 50 కంటే ఎక్కువ కంపెనీలు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి.

Also Read..

11.4 శాతం పెరిగిన భారత కంపెనీల ఆదాయం!Next Story