స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 7 |
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం కేంద్ర బడ్జెట్‌కు ముందు వెలువడే ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిని 6.5 శాతంగా సూచించింది. దీంతో మార్కెట్లలో సానుకూల ధోరణి కనబడింది. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ మిడ్-సెషన్ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. భారత వృద్ధి మిగిలిన దేశాల కంటే మెరుగ్గా ఉండనుందనే అంచనాల మధ్య సూచీలు కోలుకున్నాయి.

అయితే, కేంద్ర బడ్జెట్ ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనివల్ల లాభాలు తగ్గాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 49.49 పాయింట్లు లాభపడి 59,549 వద్ద, నిఫ్టీ 13.20 పాయింట్లు పెరిగి 17,662 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, టైటాన్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు లాభాలు సాధించాయి. టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.91 వద్ద ఉంది.

Next Story

Most Viewed