బడ్జెట్‌కు ముందు మార్కెట్లలో భారీ ర్యాలీ

by Dishanational1 |
బడ్జెట్‌కు ముందు మార్కెట్లలో భారీ ర్యాలీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ ప్రకటనకు ఒకరోజే ఉండటంతో మదుపర్లు కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ఇదే సమయంలో అమెరికా ఫెడ్ ప్రకటన ఉండటంతో సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు బలహీనంగా ఉన్నప్పటికీ, మార్కెట్ తక్కువ ద్రవ్య లోటును అంచనా వేయడంతో పన్ను రాబడులు మద్దతు ఇస్తాయని ఇన్వెస్టర్లు భావించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 612.21 పాయింట్లు లాభపడి 71,752 వద్ద, నిఫ్టీ 203.60 పాయింట్ల లాభంతో 21,725 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు 2 శాతానికి పైగా ఎగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, టైటాన్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా సన్‌ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.05 వద్ద ఉంది.

Next Story

Most Viewed