పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వాహన దారులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటన చేశారు. 6G టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్‌గా భారత్ అవతరించేలా చర్యలు చేపడుతామని అన్నారు. అంతేకాకుండా.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని మోడీ వెల్లడించారు.

‘బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికీ ప్రాధాన్యం ఉంది. ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేకచోట్ల శాటిలైట్‌ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ మెట్రో రైళ్లు, బుల్లెట్‌ రైళ్లు’ అని ప్రధాని మోదీ చెప్పారు.

Next Story

Most Viewed