ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

by Disha Web Desk 16 |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. అన్ని కాలవ్యవధులకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను 10-20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సవరించిన వడ్డీ తక్షణం అమలవుతాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు కొత్త డిపాజిట్లతో పాటు ఇప్పటికే ఉన్న డిపాజిట్ల రెన్యూవల్‌లకు రెండింటికీ వర్తిస్తాయి.

బ్యాంకు వివరాల ప్రకారం, ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 20 బేసిస్ పయింట్ల పెంపు నిర్ణయం తీసుకోవడంతో వడ్డీ రేటు 5.50 శాతానికి చేరుకుంది. అలాగే, రెండేళ్ల కాలవ్యవధిపై 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.50 శాతానికి, మూడేళ్ల కాలవ్యవధిపై 5.60 శాతం వడ్డీని చెల్లించనుంది. మూడు నుంచి ఐదేళ్ల కాల ఎఫ్‌డీపై 5.75 శాతం, 1111 రోజుల మెచ్యూర్ ఎఫ్‌డీపై 5.75 శాతం, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీని బ్యాంకు అందించనుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ ఇవ్వనుంది. ప్రస్తుతం బ్యాంకులో పని చేస్తున్న, లేదా గతంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారికి అదనంగా 150 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభించనుంది.


Next Story

Most Viewed